News August 25, 2025

HYD: సోలార్ కారిడార్‌గా ఔటర్ రింగ్ రోడ్డు !

image

నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును సోలార్ కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటికే 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌పై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 16 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్లో సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి 100 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News August 25, 2025

HYD మొత్తం వేరు.. జూబ్లీహిల్స్‌లో కథ వేరు

image

నగరం మొత్తం వినాయక చవితి వేడుకల్లో మునిగి ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కలిసినా ‘మనకు ఎన్ని ఓట్లు వస్తాయి..’ అనే అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు, దావత్‌లు ఘనంగా జరిపేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సమ్మేళనాల బాధ్యతలు స్థానిక నాయకులకు అప్పగించి వారి ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునే పనిలోపడ్డారు.

News August 25, 2025

జూబ్లీహిల్స్: కులాల లెక్కలు.. మంత్రులకు బాధ్యతలు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కులాల లెక్కలను తీస్తోంది. ఏయే సామాజికవర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయంపై పకడ్బందీగా ఆరా తీస్తోంది. అందుకే వివిధ సామాజికవర్గాలకు చెందిన మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించి ఓటుబ్యాంకు పక్కకు పోకుండా ప్రయత్నిస్తోంది. మంత్రులు పొన్నం(బీసీ), గడ్డం వివేక్(ఎస్సీ), తుమ్మల(ఓసీ)లకు బాధ్యతలు అప్పగించి అందరినీ సమన్వయపరుస్తూ విజయానికి పక్కా ప్రాణాళిక రచిస్తోంది.

News August 25, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఆ ముగ్గురి గురించి ఆరా?

image

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతి అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. బీసీ రిజర్వేషన్ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు బీసీ నాయకుల గురించే గాంధీ భవన్‌లో చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. బీసీ నాయకులైన విద్యావేత్త భవాని శంకర్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్‌లలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరు ఎవరికి వారు ఢిల్లీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.