News September 20, 2025

HYD: స్కిల్స్ నేర్చుకుంటేనే ఉపాధి: మాజీ మంత్రి

image

తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ ఎక్స్‌పో కార్యక్రమంలో BRS సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన మాజీ మంత్రి అనంతరం మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో యువత స్కిల్స్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలిపారు. తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Similar News

News September 20, 2025

HYD: రేపు పెత్తరమాస.. ఇలా చేయండి: పురోహితుడు

image

రేపు (ఆదివారం) పెత్తరమాస (పితృ అమావాస్య) రోజున కుష్మాండ గుమ్మడికాయకు ప్రత్యేక పూజలు చేయాలని HYD అల్వాల్ పరిధి కానాజిగూడలోని మరకత శ్రీలక్ష్మీగణపతి ఆలయ పురోహితుడు డా.మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత, గుమ్మడికాయను ఇంటికి కడితే నరగోష, నర పీడ, నరదృష్టి నుంచి రక్షిస్తుందని తెలిపారు. ఈనెల 22 (సోమవారం) నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయని చెప్పారు. SHARE IT

News September 20, 2025

HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

image

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.

News September 20, 2025

BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

image

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్‌పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్‌పై దాడికి సిద్ధమవుతుండగా తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.