News May 21, 2024

HYD: స్కీముల పేరిట స్కాములు.. జాగ్రత్త!

image

HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు.

Similar News

News October 3, 2024

సికింద్రాబాద్: సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆమ్రపాలి

image

సికిందరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సిఖ్ గ్రౌండ్‌లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు ఏర్పాట్లను GHMC కమిషనర్ ఆమ్రపాలి కాటా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను
కమిషనర్ ఆదేశించారు. సీఎం పర్యటన నిన్న రాత్రి ఖరారు కావడంతో అధికారులను అప్రమత్తం చేసి ఏర్పాట్లను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

News October 3, 2024

HYD: IT వైపే అందరి మొగ్గు.. కోర్ బ్రాంచీల కష్టాలు..!

image

యువత IT వైపే మొగ్గు చూపుతున్నారు. కోర్ బ్రాంచీలకు కష్టాలు ఏర్పడుతున్న తరుణంలో ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ అభ్యసించిన వారికి ప్రత్యేక స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాజధాని HYDలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో IT, CSE బ్రాంచుల్లో 99% సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి.అదే కోర్ బ్రాంచీల్లో అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.

News October 3, 2024

HYD: ఒక్క క్లిక్‌తో.. భూ వివరాలు మన చేతుల్లో!

image

HYD, RR, MDCL, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్‌తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.