News February 7, 2025

HYD: స్కూల్ పిల్లల డేంజర్‌ జర్నీ

image

నిబంధనలు పాటించని స్కూల్ వ్యాన్‌లపై RTA అధికారులు <<15385435>>తనిఖీలు<<>> చేపట్టి సీజ్ చేస్తుంటే, మరికొందరు ఇవేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓమ్నీ వెహికల్‌లో ఓ డ్రైవర్ ఏకంగా 25 మందిని ఎక్కించాడు. నాదర్గుల్ నుంచి బడంగ్‌పేటకు వెళ్లే రూట్‌లో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులను ఇలా తీసుకెళ్లడం ఏంటని స్థానికులు నిలదీశారు. వ్యాన్ మీద, డోర్లు ఓపెన్ చేసి ప్రమాదకరంగా తరలించడం గమనార్హం.

Similar News

News February 7, 2025

విశాఖ: టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. పీఆర్టీయూ మ‌ద్ద‌తుతో బ‌రిలోకి దిగిన‌ మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నూక‌ల సూర్యప్ర‌కాష్‌,రాయ‌ల స‌త్య‌న్నారాయ‌ణ‌, పోతల దుర్గారావు త‌మ మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి రిట‌ర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి.

News February 7, 2025

వివేకా కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?: దస్తగిరి

image

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.

News February 7, 2025

ఆసిఫాబాద్: ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీ పై సమాచారం తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో ప్రసవాల గురించి ఆరా తీశారు. 

error: Content is protected !!