News July 23, 2024
HYD: స్టాక్స్‌లో లాభాలని రూ.16.73 లక్షలు లూటీ

స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 6, 2026
HYDలో అంతుచిక్కని Mystery!

విజయశాంతి సూసైడ్ కేసులో మిస్టరీ వీడలేదు. భర్తతో విభేదాలు, ఫ్యామిలీ టెన్షన్స్ లేవు. మెరుగైన జీవనం సాగిస్తోన్న ఫ్యామిలీ రైల్వే పట్టాలపై మృతదేహాలుగా మారడం అంతు చిక్కడం లేదు. సాంకేతిక ఆధారాలు పరిశీలించగా 2 అఫీషియల్ కాల్స్ మాత్రమే ఉన్నాయట. కారులో లభించిన ల్యాప్‌టాప్‌ను సైతం FSLకి పంపారు. అయితే, తల్లితో పాటు పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం వెనుక కారణం ఏంటనే కోణంలో SCR పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
News February 6, 2026
HYDలో ఎక్కడికెళ్లినా రూ.5కే టిఫిన్!

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ క్యాంటీన్లను ఇక విస్తరించనున్నారు. ప్రస్తుతం 150 పాత డివిజన్లలో క్యాంటీన్లు ఉన్నాయి. అన్ని క్యాంటీన్లలో లంచ్, 60 క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నారు. ప్రస్తుతం GHMCలో 300 వార్డులు పెరగడంతో మరో 2 నెలల్లో ఇక్కడ కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గల్లీ నుంచి ORR వరకు రూ.5కే టిఫిన్, లంచ్ అందనుంది.
News February 6, 2026
HYD: బర్త్ డే రోజు Self Satisfaction ఇదే!

నగరంలో కొత్త ట్రెండ్‌ను యూత్ ఫాలో అవుతుంది. బర్త్ డే వస్తే దావత్‌లు చేసుకున్నా కిక్ రావడం లేదంటా. అందుకే సోషల్ యాక్టివిటీస్ పేరిట ఏదో ఒక సేవ చేస్తున్నారు. అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద పేదల కడుపు నింపుతున్నారు. అభాగ్యుల నడుమ కేక్ కట్ చేసి వారితో హైదరాబాద్ యువత హార్ట్ ఫుల్‌గా సంతృప్తి చెందుతుంది. కొందరు SMలో ప్రమోట్ చేసుకుంటుంటే.. మరికొందరు మూడో కంటికి తెలియకుండా సేవ చేస్తున్నారు.


