News May 31, 2024

HYD: స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు

image

స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని ఓ అపార్ట్‌మెంట్లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు రైడ్స్ చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

Similar News

News January 16, 2025

RR: గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలి: డిప్యూటీ కమిషనర్

image

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ యంత్రాంగంతో రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని 20 ఎక్సైజ్ పీఎస్‌‌లలో చాలా కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనాల వేలాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.  

News January 16, 2025

ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం

image

HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 16, 2025

శంకర్‌పల్లి: మరకత శివాలయానికి హంపి పీఠాధిపతి

image

శంకర్‌పల్లి మండలం చందిప్పలోని 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి ఫిబ్రవరి 5న హంపి పీఠాధిపతి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.