News September 9, 2025
HYD: స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది

పోకిరీల ఆట కట్టించేందుకు వెస్ట్ జోన్‌లోని షేక్‌పేట్, ఖైరతాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. రాత్రివేళల్లో అతివేగంతో వాహనాలు నడిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి, చలాన్ కట్టిన తర్వాతే తిరిగి అప్పగిస్తున్నారు. ఈ డ్రైవ్‌ను 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 నెలలుగా నిర్వహిస్తున్నారు.
Similar News
News September 10, 2025
HYD: కాళోజి మాటలు అందరికీ స్ఫూర్తి కావాలి

పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమమే ఊపిరిగా కాళోజి జీవించారని పేర్కొన్నారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ఆయన చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.
News September 9, 2025
ఆత్మహత్యల నివారణపై బంజారాహిల్స్‌లో స్పెషల్ ప్రోగ్రాం

వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడే వారి బాధలను విని వారికి అండగా నిలుస్తూ నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్న రోషిని సంస్థ ఏర్పడి 28 ఏళ్ల అవుతోంది. సంస్థ వాలంటీర్లు ఆనంద దివాకర్, విద్యారెడ్డి ఈనెల 10న ఆత్మహత్యల నివారణ గురించి వివరించారు. ఈ నెల 10న ఎల్వి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగే కార్యక్రమానికి నటుడు సుమన్ హాజరవుతారని తెలిపారు.
News September 9, 2025
ఓయూ లైజన్ ఆఫీసర్ దీపక్ కుమార్‌కు పదోన్నతి

ఉస్మానియా యూనివర్సిటీ లైజన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దీపక్ కుమార్‌కు పదోన్నతి లభించింది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న ఆయనను అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పిస్తూ వీసీ ప్రొ.కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఆయన కీలకమైన డాక్, స్టోర్స్, స్టేషనరీ వంటి విభాగాలలో పనిచేశారు. ఓయూ ఉద్యోగ సంఘం నాయకుడిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.