News September 13, 2025

HYD: స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ నుంచి తప్పుకుంటున్న GHMC!

image

నగరంలో చాలా చోట్ల GHMCకి స్పోర్ట్స్ కాంప్లెక్సులు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణ భారంగా అనిపించిందో, లేక ఆదాయం పొందాలని అనుకుంటోందో తెలియదు కాని మెయింటెనెన్స్ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. సిటీలో ఉన్న పలు స్పోర్ట్స్ కాంప్లెక్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నడుం బిగించింది. రెండేళ్లపాటు వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొదటి దశలో 9 కాంప్లెక్సులను అప్పగించనుంది.

Similar News

News September 13, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

image

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.

News September 13, 2025

గ్రేటర్ HYDలో సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని TGSPDCL అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 3,600 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అధిక డిమాండ్ కారణంగా సరఫరా స్థిరంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 13, 2025

HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్‌మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్‌లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.