News September 13, 2025
HYD: స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ నుంచి తప్పుకుంటున్న GHMC!

నగరంలో చాలా చోట్ల GHMCకి స్పోర్ట్స్ కాంప్లెక్సులు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణ భారంగా అనిపించిందో, లేక ఆదాయం పొందాలని అనుకుంటోందో తెలియదు కాని మెయింటెనెన్స్ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. సిటీలో ఉన్న పలు స్పోర్ట్స్ కాంప్లెక్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నడుం బిగించింది. రెండేళ్లపాటు వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొదటి దశలో 9 కాంప్లెక్సులను అప్పగించనుంది.
Similar News
News September 13, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని పశువుల యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News September 13, 2025
కొయ్యలగూడెం: వర్జినియా పొగాకు రికార్డు ధర

వర్జినియా పొగాకు ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో శనివారం జరిగిన కొనుగోళ్లలో కేజీ రూ.430కి చేరింది. దాదాపు 60 సంవత్సరాల వర్జినియా చరిత్రలో ఇదే అత్యధిక ధర అని తెలుస్తోంది. రెండు రోజుల వ్యవధిలో రూ.35 పెరగడం నమ్మలేని విషయమని రైతాంగం చెబుతోంది. కొనుగోళ్లు ప్రక్రియ ముగుస్తున్న సమయాల్లో ధర పెరుగుదల సాధారణమే అయినప్పటికీ ఇంత వేగంగా పెరగడం అరుదని వారు అంటున్నారు.
News September 13, 2025
కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.