News February 4, 2026
HYD: స్మోకింగ్, ఆల్కహాల్‌తో క్యాన్సర్: డా.దుర్గాప్రసాద్

పర్యావరణ కాలుష్యం, స్మోకింగ్, ఆల్కహాల్ వ్యసనాలతో క్యాన్సర్ వస్తుందని GGH మహేశ్వరం ENT సర్జన్ డా.KVN దుర్గాప్రసాద్ అన్నారు. ‘ఆహారం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా, దగ్గితే రక్తం పడినా, గడ్డలు, పుండ్లు, దగ్గు తగ్గకపోవడం లక్షణాలు. గుడ్లు, ఆకుకూరలు, శనగపప్పు ఉండలు ఎక్కువ తీసుకోవాలి. ప్రొటీన్, విటమిన్లు శరీరానికి సరిగ్గా అందాలి. భయం వీడి చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు.
నేడు వరల్డ్ క్యాన్సర్ డే
Similar News
News February 4, 2026
స్వామి వివేకానంద HYD పర్యటనకు 133 ఏళ్లు

స్వామి వివేకానంద భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏళ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠం శాఖ ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమాలన్నీ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహారాజ్ తెలిపారు. ఆయన ఇక్కడకి వచ్చినప్పుడు ఈ కాలేజీలోనే ప్రసంగించారు.
News February 4, 2026
బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్

హీరోయిన్ ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లపై కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యకరంగా, కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి, కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
News February 4, 2026
HYD: రూ.20,930 శాలరీలో రూ.11,930 కమీషన్

”నోరు తెరిస్తే పనిలోంచి తీసేస్తాం.. ఇచ్చింది పుచ్చుకొని పడి ఉండండి” అంటూ GHMC ఎంటమాలజీ కార్మికులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిలువునా దోచుకుంటున్నాయి. నెలకు రావాల్సిన ₹20,930 జీతంలో, ఏకంగా ₹11,930 కమీషన్ కింద నొక్కేస్తూ కేవలం ₹9,000 మాత్రమే చేతిలో పెడుతున్నారని సమాచారం. 2021 నుంచి సాగుతున్న ఈ ‘దందా’పై కార్మికులు గళమెత్తినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.


