News July 10, 2025

HYD: స్వరూప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలింపు

image

కల్తీకల్లు తాగి మృతి చెందిన స్వరూప మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి కుటుంబ సభ్యులు తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చరికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాహన సంస్కారాలకు అన్ని సిద్ధం చేసుకుంటే అధికారులు ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. పోస్టుమార్టం నిమిత్తమై తరలించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News July 10, 2025

చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

image

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన ‘టో ఫిష్’ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక ‘టో ఫిష్’ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు. కాగా సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు.

News July 10, 2025

మరో 6 దేశాలకు టారిఫ్స్ ప్రకటించిన ట్రంప్

image

అధిక సుంకాల విధింపు గడువును US అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటికల్లా ఒప్పందాలు చేసుకోకపోతే అమెరికాకు ఎగుమతులపై పెంచిన టారిఫ్స్ కట్టాలి. రెండ్రోజుల క్రితం 14 దేశాలకు ఈ టారిఫ్స్ వివరాలతో లేఖలు పంపారు. ఇప్పుడు మరో ఆరు దేశాలకు ట్రంప్ కొత్త టారిఫ్స్‌ ప్రకటించారు. ఇరాన్-30%, అల్జీరియా-30%, లిబియా-30%. ఫిలిప్పీన్స్-25%, బ్రూనై-25%, మోల్డోవా-25% చెల్లించాలని తెలిపారు.

News July 10, 2025

రాజధాని రైతులు కోరినట్లే ప్లాట్లు: నారాయణ

image

AP: పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై మంత్రి చర్చించారు. ప్లాట్ల కేటాయింపుపై రైతులు కూడా తమ అభిప్రాయాలను మంత్రి నారాయణకు తెలియజేశారు. రైతులు కోరినట్లే ప్లాట్ల కేటాయింపు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.