News June 28, 2024
HYD: హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో చిన్నారి మృతి

HYD శామీర్‌పేట్ మండలం హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ప్రాంగణంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్కూల్ ప్రాంగణంలోని నీటి గుంతలో పడి కాన అనే రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు కాగా వారు HYD వలస వచ్చి హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ నర్సరీలో పని చేస్తున్నారు. జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.
Similar News
News February 4, 2026
రంగారెడ్డి జిల్లా DEOపై ACBకి ఫిర్యాదు!

రంగారెడ్డి జిల్లా DEO సుశీందర్రావు ఆస్తిపాస్తుల, ఆదాయ వ్యయాలపై వెంటనే పూర్తి సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ACBకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలోని అందరూ MEOలు, DEO ఆఫీసులో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న బాదం వెంకటేశ్, లక్ష్మీనరసింహులు ఆస్తులపైనా సమగ్ర విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 4, 2026
మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
News February 4, 2026
RR: మున్సిపల్ బరిలో 437 మంది అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.126 వార్డుల్లో మొత్తం 615 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 178 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 437 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ 126, బీఆర్ఎస్ 122, బీజేపీ 109, బీఎస్పీ 3, CPI(M) 2, MIM 1, AIFB2, సీపీఐ 2, జనసేన 9, ఇండిపెండెంట్ 57, ఇతరులు నలుగురు బరిలో ఉన్నారు.


