News December 18, 2025
HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.
Similar News
News December 28, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఆదివారం తెల్లవారుజామున 261కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 28, 2025
HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.
News December 28, 2025
సెట్విన్‌ను కదిలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి అసద్ అల్టిమేటం!

పురానీహవేలీ నుంచి SETWINను షిఫ్ట్ చేయొద్దంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సర్కార్‌పై ఒత్తిడి పెంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్‌లకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. “అక్కడి నుంచి ఆఫీసు కదిలిస్తే కుదరదు.. యథాతథంగా కొనసాగించాల్సిందే” అని స్పష్టం చేశారు. అంతేకాదు, లోకల్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీని రంగంలోకి దించి, స్వయంగా సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని అసద్ ఆర్డర్ వేశారు. మరి సర్కార్ ఏమంటుందో చూడాలి!


