News July 3, 2024

HYD: హిమాయత్‌నగర్‌లో గరిష్ఠ వర్షపాతం నమోదు

image

నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. అరగంటలోనే హిమాయత్ నగర్‌లో 3.6 సెంటీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 1.2 సెంటీమీటర్లు, రాయదుర్గం, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బన్సీలాల్‌పేట్, మాదాపూర్, అబిడ్స్, తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. గాలివాన కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడగా, పలుచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

Similar News

News July 5, 2024

గాంధీనగర్: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

image

తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అబ్దుల్ రజాక్ కూతురు(13) ఇటీవల బన్సీలాల్ పేట్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకొని వచ్చింది. అంతదూరం వెళ్లి రావడంపై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

HYD: బస్సులో మహిళ ప్రసవం.. అభినందించిన ఎండీ సజ్జనార్

image

ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డ్రైవర్, కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం అభినందనీయమన్నారు.

News July 5, 2024

WOW.. HYD నగరంలో హెరిటేజ్ అందాలు!

image

HYD నగరం హెరిటేజ్ అందాలకు మారుపేరుగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి HYD నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోకాపేటలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 120 మీటర్ల ఎత్తులో ఈ హెరిటేజ్ టవర్ ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.