News March 30, 2025

HYD: హీరో ప్రభాస్ PRO పేరిట వార్నింగ్.. కేసు నమోదు

image

హీరో ప్రభాస్ PRO అంటూ తనకు కాల్ చేసి బెదిరించారని జూబ్లీహిల్స్ PSలో యూట్యూబర్ ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాలు.. మార్చి 4న విజయ్‌సాధు ప్రభాస్‌కు సర్జరీ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఆ హీరో PROను అంటూ సురేశ్ అతడికి కాల్ చేసి వెంటనే డిలీట్ చేయాలని దూషించాడు. విజయ్‌సాధు వీడియో డిలీట్ చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులకు సురేశ్ లింక్ పంపాడు. FANS సైతం వార్నింగ్ ఇవ్వడంతో విజయ్ పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News April 2, 2025

HYD: పల్లె నుంచి పట్నంకు తాటి ముంజలు

image

నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు‌ వచ్చేశాయి. ముషీరాబాద్‌, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్‌మెట్ ఫ్లై ఓవర్‌ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.

News April 2, 2025

HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

image

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్‌పురా, చార్మినార్‌లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్‌ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్‌ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.

News April 2, 2025

HYD: CM రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

image

శ్రీరామనవమి శోభాయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.

error: Content is protected !!