News July 19, 2024

HYD: హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.21 మీటర్లు..!

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Similar News

News February 12, 2026

ఫ్యూచర్ సిటీ, RRR.. పల్లెల రూపు రేఖలు మారనున్నాయా.?

image

ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో గొప్ప నగరాన్ని నిర్మించి చూపిస్తామని రేవంత్ సర్కార్ ఢంకా బజాయించి చెబుతోంది. దీంతో పాటు కందుకూరు, యాచారం, తలకొండపల్లి, ఆమనగల్ ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టుల గనుక నిర్మాణం చేపడితే ఇక్కడి పల్లెల రూపు రేఖలు నిజంగా మారే అవకాశం ఉందా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ కాంమెంట్.

News February 11, 2026

3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

image

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.

News February 11, 2026

RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్‌పల్లి 49.63, షాద్‌నగర్ 52.43% నమోదైంది.