News October 7, 2025
HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్‌గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Similar News
News October 7, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి.కర్ణన్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రచురితమయ్యే వార్తలు, ప్రకటనలు, చెల్లింపు వార్తలపై ఈ కమిటీ పర్యవేక్షణ చేయనుంది. కర్ణన్ కమిటీ ఛైర్మన్‌గా, PRO మామిండ్ల దశరథం మెంబర్ సెక్రటరీగా ఉన్నారు. కమిటీ ఎన్నికల పారదర్శకత, మీడియా సమన్వయానికి సహకరించనుంది.
News October 7, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. విధుల్లో ఐదువేల మంది

ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత రాజకీయ పార్టీలో టెన్షన్ ఉండటం సహజం. అయితే ఎన్నికలు నిర్వహించే అధికారులు, సిబ్బందికి కూడా ఆందోళన ఉంటుంది. ఎక్కడా.. ఎటువంటి పొరపాట్లు జరుగకుండా ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే చీవాట్లు తప్పవు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు 5వేల మందిని నియమించారు. ఇబ్బందులు తలెత్తకుండా ఎవరెవరు ఏమేమి పనులు చేయాలనేది వారికి స్పష్టంగా వివరించారు.
News October 7, 2025
HYD: సిటీలో 8,02,026 రేషన్ కార్డులు

రేషన్ కార్డుల పంపిణీకి నగరంలో విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు 1,62,575 కొత్త కార్డులను అధికారులు జారీ చేశారు. గతంలో హైదరాబాద్ వ్యాప్తంగా కేవలం 6,39,451 కార్డులుండగా కొత్త కార్డులు మంజూరు చేసిన తరువాత వాటి సంఖ్య ఏకంగా
8 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం సిటీలో 8,02,026 కార్డులున్నాయి. రేషన్ కార్డుల సంఖ్య పెరగడంతో త్వరలో రేషన్ షాపులు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.