News August 3, 2024

HYD: హెరిటేజ్ భవనంగా ఉస్మానియా ఆసుపత్రి

image

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్‌ను గోషామహల్‌లోని పోలీస్ క్వార్టర్స్‌కు తరలిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాత ఉస్మానియా భవనాన్ని హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Similar News

News September 18, 2025

HYDలో ఉచిత బస్‌పాస్ ఇవ్వండి సీఎం సార్!

image

విద్యా వ్యవస్థను మార్చేద్దాం అని అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ఈ రోజు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ముందుగా విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థినులకు ఎలాగూ మహాలక్ష్మి సౌకర్యం ఉంది. ఎటొచ్చీ బాయ్స్‌కే ఈ సమస్య. రూ.కోట్లు ‘మహాలక్ష్మి’కి కేటాయిస్తున్న ప్రభుత్వం.. HYDలో కిక్కరిసి ప్రయాణించే స్టూడెంట్‌కు బస్‌పాస్ ఫ్రీగా ఇవ్వాలని కోరుతున్నారు.

News September 18, 2025

జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ నాయకురాలు?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల్లో తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ పార్టీ HYD నేత మాధవీలత పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారని సమాచారం. తాను పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ అదృష్టం దక్కాలని కోరుకుంటున్నానని బోరబండలో పేర్కొన్నారు. మాధవీలత గతంలో HYD ఎంపీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు.

News September 18, 2025

జూబ్లీహిల్స్‌లో ‘కలర్ ఫొటో’కు అవకాశం?

image

త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలలో ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అమలు చేస్తారో? లేదో? కమిషన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలర్ ఫొటో గురించి ఇప్పటికే అన్ని రాష్ర్టాలకూ ఈసీ లేఖలూ రాసింది. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాడే EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటో చూసి ఓటేయవచ్చన్న మాట.