News October 9, 2025

HYD: హైఅలర్ట్.. RTC X రోడ్ బంద్

image

BRS‌ చలో బస్ భవన్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. RTC X రోడ్‌ను క్లోజ్ చేశారు. అశోక్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, విద్యానగర్‌ నుంచి బస్‌ భవన్‌కు వెళ్లే మార్గాల్లో భారీకేడ్లు పెట్టారు. రోడ్లు మొత్తం క్లోజ్ అవడంతో ఉదయం ఉద్యోగాలకు బయల్దేరిన వారు అవస్థలు పడ్డారు. గల్లీలన్నీ తిరిగి.. తిరిగి గమ్య స్థానాలకు వెళ్లాల్సి వస్తోందని ఓ వాహనదారుడు Way2Newsకు తెలిపారు.

Similar News

News October 9, 2025

ప్రేమ భద్రంగా ఉండేందుకు తాళం వేసేవారు!

image

పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమకు చిహ్నంగా తాళాలు వేసే సంప్రదాయం (గుళ్లలో ముడుపుల మాదిరిగా) ఉండేది. తమ ప్రేమ శాశ్వతం కావాలని కోరుకునే జంటలు ఇక్కడ లాక్ చేసి, కీలను సీన్ నదిలో పడేసేవారు. అయితే తాళాల బరువుతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పారిస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 2015లో తాళాలను తొలగించి, వాటి స్థానంలో గాజు ప్యానెళ్లను అమర్చింది. ప్రస్తుతం ఇక్కడ తాళాలు వేయడం పూర్తిగా నిషేధం.

News October 9, 2025

నర్మేట: పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

నర్మేట మండలం గండిరామవరం గ్రామానికి చెందిన వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ముక్కెర లావణ్య(30) గురువారం ఉదయం ఇంట్లో పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతిరాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

News October 9, 2025

ములుగు: ‘తక్షణమే వేతనాలు చెల్లించాలి’

image

ములుగు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జాకారం, ఏటూరునాగారం బాలుర, ములుగు బాలికల భోధన సిబ్బంది, పార్ట్ టైం టీచర్స్ గత 3 నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా బోధన, బోధనేతర విధులను తక్కువ వేతనంతో నిర్వహిస్తున్నామని వాపోయారు. మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని ములుగు డీసీవో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు.