News October 9, 2025

HYD: హైఅలర్ట్.. RTC X రోడ్ బంద్

image

BRS‌ చలో బస్ భవన్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. RTC X రోడ్‌ను క్లోజ్ చేశారు. అశోక్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, విద్యానగర్‌ నుంచి బస్‌ భవన్‌కు వెళ్లే మార్గాల్లో భారీకేడ్లు పెట్టారు. రోడ్లు మొత్తం క్లోజ్ అవడంతో ఉదయం ఉద్యోగాలకు బయల్దేరిన వారు అవస్థలు పడ్డారు. గల్లీలన్నీ తిరిగి.. తిరిగి గమ్య స్థానాలకు వెళ్లాల్సి వస్తోందని ఓ వాహనదారుడు Way2Newsకు తెలిపారు.

Similar News

News October 9, 2025

ఎన్నికల సిత్రాలు షురూ: ఎర్రగడ్డలో మిర్చి బజ్జీ వేసి!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సిత్రాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో BRS అభ్యర్థి మాగంటి సునీత తన దైన శైలిలో వెళుతున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని బి.శంకర్‌లాల్‌నగర్, సుల్తాన్‌నగర్‌లో కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావుతో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఓ హోటల్ వద్ద మిర్చి బజ్జీలు వేశారు. ఉప ఎన్నిక ప్రచారం ముగింపు వరకు ఇంకెన్ని సిత్రాలు ఉంటాయో చూడాలి.

News October 9, 2025

హైదరాబాద్‌‌ కెప్టెన్‌గా తిలక్ వర్మ

image

రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ‌‌కు బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా రాహుల్ సింగ్ ఉన్నారు. అయితే, ఢిల్లీ, పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్‌తో హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌ల్లో తలపడనుంది. నగరవాసులు ఎంతగానో అభిమానించే తిలక్ వర్మ హైదరాబాద్‌ కెప్టెన్‌గా కావడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 9, 2025

HYD: అడుగడుగునా పోలీసులు

image

బీఆర్ఎస్ ఛలో బస్ భవన్ పిలుపు మేరకు సిటీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్‌కు హరీశ్ రావు బస్సులో బయల్దేరారు. రేతిఫైల్ నుంచి KTR ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. పోలీసుల బందోబస్తు చూసి BRS నేతలు ఖంగుతిన్నారు. ఇంతకీ చలో బస్ భవన్ నేతలా? లేక పోలీసులా? పిలుపునిచ్చింది అంటూ SMలో ఫొటోస్ పెట్టి మరీ కామెంట్లు చేస్తున్నారు.