News September 19, 2025

HYD: హైకోర్టును ఆశ్రయించిన హరీశ్‌రావు

image

BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు తనపై నమోదైన 3 వేర్వేరు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ HYDలోని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను, ఆలయ ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

Similar News

News September 19, 2025

భీమవరం: ఈవీఎంల భద్రతను తనిఖీ చేసిన కలెక్టర్

image

కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం భీమవరంలోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను, ఈవీఎంల రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో ఆమె సంతకం చేశారు. పలు సూచనలను కలెక్టర్ అందజేశారు. విధుల్లో ఉన్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News September 19, 2025

కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

image

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.

News September 19, 2025

ఆధార్ నమోదు లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 192 ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. 0-5 ఏళ్ల పిల్లలకు ఆధార్ నమోదు, 5-7 ఏళ్ల వారికి వేలిముద్రలు, 15-17 ఏళ్ల వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ వంటి పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు.