News September 10, 2025
HYD: హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

HYD హైకోర్టు ఎదుట బుధవారం అడ్వకేట్లు పాంప్లెట్లతో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ సురేశ్ బాబుపై జరిగిన దాడికి నిరసనగా గేట్ నంబర్ 6 వద్ద నిరసన ప్రోగ్రాం నిర్వహించారు. వెంటనే సత్వర న్యాయం జరగాలని అందరూ కలిసి డిమాండ్ చేశారు.
Similar News
News September 11, 2025
HYD: మియాపూర్‌లో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

HYD మియాపూర్ డివిజన్ పరిధిలో బుధవారం సినీ నటి మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. మృణాల్ ఠాకూర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో స్థానికంగా సందడి నెలకొంది.
News September 11, 2025
HYD: ముమ్మరంగా వరద సహాయక చర్యలు: మంత్రి

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం సహాయక చర్యలపై HYDలో సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు. ఇప్పటి వరకు పరిహారం విడుదల చేయకపోతే వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు.
News September 11, 2025
HYD: రూ.25 లక్షలతో ఓలా డ్రైవర్ పరార్

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓలా కార్ డ్రైవర్ రూ.25 లక్షల నగదుతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు సికింద్రాబాద్ నుంచి బాలానగర్ బ్రాంచ్‌కు డబ్బులు తీసుకొస్తున్నారని, మ.2 గంటల సమయంలో బ్యాంక్ సిబ్బంది కారులో నుంచి దిగిన వెంటనే డ్రైవర్ పెట్టెతో ఉడాయించాడన్నారు. బ్యాంక్ ఉద్యోగుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.