News October 10, 2024

HYD: హైడ్రా పవర్స్.. పూర్తి వివరాలు!

image

ప్రభుత్వం జులై 17న హైడ్రా ఏర్పాటు చేస్తూ GO 59 జారీ చేసింది. గ్రేటర్‌తో పాటు 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 38 పంచాయతీలు, 61 పారిశ్రామికవాడలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను హైడ్రాకు అప్పగించింది. GHMC, స్థానిక సంస్థల పరిధి పార్కులు, లే అవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల స్థలాలు పరిరక్షించడమే దీని బాధ్యత. తాజాగా 51 విలీన గ్రామాలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి.

Similar News

News October 10, 2024

HYD: ఉత్తమ్ తండ్రికి నివాళులర్పించిన అగ్రనేతలు

image

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మందకృష్ణ మాదిగ హాజరై పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

News October 10, 2024

HYD: ప్రజారోగ్య అడిషనల్ డైరెక్టర్‌గా కాకుమాను శశిశ్రీ

image

తెలంగాణ డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్)గా కాకుమాను శశిశ్రీ బాధ్యతలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్యశాఖలో అపారమైన అనుభవం కలిగిన అధికారి రావడంతో అధికారులు, ఉద్యోగులు పట్లఉద్యోగులు వర్షం వ్యక్తం చేశారు.

News October 10, 2024

HYD: బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన RTC ఎండీ

image

తెలంగాణ ఆడపడుచులకి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడవపడుచులు బతుకమ్మను రంగు పూలతో అలంకరించి పూజలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని కీర్తించారు.