News October 6, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు

HYDలోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజావాణిలో భాగంగా అనుమతులు లేని లేఅవుట్లతో పాటు రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News October 7, 2025
HYD: ఇక.. ఆర్టీసీ డ్రైవర్లకు సీటు బెల్ట్ తప్పనిసరి..!

HYD నగరం సహా రాష్ట్రంలోని అనేక డిపోల పరిధిలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్లకు సీటు బెల్టులు పెట్టుకోవడం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో బస్సుల్లో డ్రైవర్ సీట్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ సీట్లకు సీటు బెల్టులు అమరుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా ప్రాంతాలకు సైతం ఈ నిబంధన విస్తరిస్తామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
News October 7, 2025
HYD: హైడ్రాను అభినందించిన హైకోర్టు

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సోమవారం ప్రశంసలు కురిపించారు. నగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా యజ్ఞంలా పని చేస్తోందని అభినందించారు. బతుకమ్మకుంటను చూస్తే ముచ్చటేస్తోందని చెప్పారు. టీడీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానాన్ని రూపొందించాలని జస్టిస్ సూచించారు.
News October 7, 2025
HYD: రిజర్వేషన్లను అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దు: వీహెచ్

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. సుప్రీంకోర్టు పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అయినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దన్నారు.