News October 27, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

image

HYDలోని బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తూములు మూసేసి అలుగుల ఎత్తు పెంచుతున్నారని కొంతమంది, చెరువుల్లో మట్టి పోసి ఎకరాల కొద్ది కబ్జా చేస్తున్నారని మరి కొంతమంది ఫిర్యాదు చేశారన్నారు. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

శ్రీకాకుళం: ‘విద్యుత్ సరఫరా అంతరాయానికి ఈ నంబర్లను సంప్రదించండి’

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి క్రిష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లో 9490610045, 9490610050 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిమనిన్నారు. విద్యుత్ లైన్లు తెగిపడినా.. స్తంభాలు పడిపోయిన తదితర సమస్యలు ఎదురైతే ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.

News October 27, 2025

AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

image

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్‌: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు

News October 27, 2025

విశాఖ: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధం

image

మొంథా తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ సిద్ధంగా ఉందని సీఎండీ పృథ్వితేజ్ తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్‌ఫార్మర్లు, 115 క్రేన్లు, 144 వైర్ లెస్ హ్యాండ్ సెట్లు, 80 JCBలు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు.