News July 7, 2025
HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News July 7, 2025
రేపే అరుణాచలం యాత్ర బస్సు ప్రయాణం: GDK – DM

కాణిపాకం, అరుణాచలం, జోగులాంబ, గోల్డెన్ టెంపుల్ వీక్షించే యాత్రికులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మంగళవారం ఈ బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు బుకింగ్ కోసం 7013504982 ను సంప్రదించాలని కోరారు. ఈ యాత్రకు రాజధాని AC బస్సు సమకూర్చామన్నారు. ఛార్జీలు పెద్దలకు ₹5900, పిల్లలకు ₹4900గా నిర్ణయించామన్నారు.
News July 7, 2025
పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
News July 7, 2025
శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.