News October 6, 2025

HYD: హైవేలపై ఏ మాత్రం తగ్గని ట్రాఫిక్ జామ్..!

image

HYD నుంచి వరంగల్, విజయవాడ, నాగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల పండుగ నేపథ్యంలో సిటీ నుంచి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి నగరానికి వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు అనేక చోట్ల ట్రాఫిక్ పోలీసులు, సిబ్బందిని, SCSC బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.

Similar News

News October 6, 2025

HYD: పదేళ్ల KCR పాలనలో అభివృద్ధి లేదు: మంత్రి

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీసీకే టికెట్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. KCR పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి దూరమైందని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

News October 6, 2025

జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థికి టికెట్ ఖాయం: TPCC చీఫ్

image

జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థికి టికెట్ ఖాయమని, ముగ్గురు బీసీల మధ్య గట్టి పోటీ ఉందని, రేపు సీఎం‌తో చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్ట్‌ను ఏఐసీసీకి పంపిస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. HYDలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. మంత్రుల రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక చేస్తామని, రెండు మూడు రోజుల్లోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

News October 6, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు

image

HYDలోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజావాణిలో భాగంగా అనుమతులు లేని లేఅవుట్లతో పాటు రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.