News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 2, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి సడన్ ఎంట్రీ

image

సీఎం రేవంత్ రెడ్డి గురువారం అకస్మాత్తుగా మీర్ఖాన్‌పేట్‌లో FCDA ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి పనులు తొందరగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పక్కనే నిర్మాణం అవుతున్న స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను సైతం పరిశీలించారు. సీఎం వెంట FCDA కమిషనర్ శశాంక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ సుధీర్‌బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు.

News April 2, 2026

HYD: బల్దియాలో ‘డీజిల్’ దందా.. తిరగని బండ్లు, కోట్ల బిల్లులు!

image

మున్సిపల్ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. గల్లీల్లోకి రాని స్వచ్ఛ ఆటోలు, ట్రక్కులు తిరిగినట్లు GPSలో మాయాజాలం చేస్తూ కోట్ల రూపాయల డీజిల్ బిల్లులు డ్రా చేస్తున్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ తనిఖీల్లో 15% వాహనాల రీడింగ్‌లకు, బంక్ బిల్లులకు పొంతన లేకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. తప్పుడు లాగ్ బుక్కులతో ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్న అధికారుల బాగోతంపై విజిలెన్స్ నివేదిక సిద్ధమైంది.

News April 2, 2026

జలమండలిలో ‘మీటర్’ మాయ.. రూ.200 కోట్ల దోపిడీ!

image

జలమండలి ఆదాయానికి లైన్‌మెన్లు భారీ గండి కొడుతున్నారు. నగరంలో 80% కనెక్షన్లకు మీటర్లు పనిచేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కమర్షియల్ భవనాల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. 2024-25 ఆడిట్ ప్రకారం ‘నాన్-రెవెన్యూ వాటర్’ లెక్కలు 50% దాటడం గమనార్హం. దీనివల్ల ఏటా రూ.200 కోట్ల ఆదాయం గాలిలో కలిసిపోతోంది. అవినీతికి పాల్పడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.