News September 3, 2024

HYD: హోటళ్లలో మహిళా భద్రతపై DGP సూచనలు

image

HYD నగరంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP షికా గోయల్ హోటల్ అగ్రిగెటర్ల మీటింగ్లో ఈ సూచనలు చేశారు.
✓రెంటుకు ఇచ్చేటప్పుడు సరైన భద్రత చర్యలు పాటించాలి
✓ఐడి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి
✓హోటళ్లలో CCTV బ్యాకప్ ఉండాలి ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్ నెంబర్ అందించాలి ✓హోటళ్లలో మహిళా భద్రతపై కఠినంగా వ్యవహరించాలి.

Similar News

News January 15, 2025

HYD: పొలం అనుకుంటే పొరపాటే..!

image

ఈ ఫోటోలో పచ్చని పైరులా కనిపించేది.. పొలం, నారుమడి అని అనుకుంటే పొరపాటే. HYD పరిధి కొండాపూర్ మజీద్‌బండ చెరువును గుర్రపు డెక్క కప్పేయడంతో ఇలా కనిపిస్తోంది. HYDలో అనేక చెరువుల పరిస్థితి ఇదే విధంగా ఉందని, గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. చెరువుల సుందరీకరణపై శ్రద్ధ ఎక్కడ..? అని ప్రశ్నించారు.

News January 15, 2025

HYD: జంక్షన్ల అభివృద్ధి పై GHMC FOCUS

image

గ్రేటర్ HYDలో జంక్షన్‌లలో వంతెనలు, అండర్ పాస్ నిర్మాణాల సుందరీకరణపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ సర్కిల్ సంత్ నిరాకారి భవన్ జంక్షన్ ప్రాంతాన్ని అద్భుతమైన కళారూపాలతో తీర్చిదిద్ది, ప్రత్యేకంగా ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్తున్న వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది.

News January 15, 2025

HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?

image

ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలోప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.