News July 10, 2024

HYD: హోటళ్లు, రెస్టారెంట్లపై ఇలా ఫిర్యాదు చేయండి.!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, చాయ్ బండ్లు, పానీపూరి బండ్లలో పాడైన ఆహారాన్ని విక్రయించడం, బిర్యానీలో బొద్దింక, పూరిలో గుండు పిన్ను లాంటివి రావడంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. కలుషిత ఆహారాన్ని గుర్తిస్తే వాట్సాప్ నం. 9100105795, 040-21111111, మెయిల్, ‘X’లో తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు అందితే వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.SHARE IT

Similar News

News February 10, 2026

HYD: జ్యోతిర్లింగాల దర్శనం.. FEB 21 నుంచి షురూ

image

దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ FEB 21 నుంచి 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచీ, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శంచుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. పెద్దలకు రూ.14,700లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్‌ ధరను అధికారులు నిర్ణయించారు. SHARE IT.

News February 10, 2026

HYD: కాగితాల్లో తగ్గుదల.. వాడల్లో జ్వరాల హోరు!

image

HYDలో డెంగ్యూ తగ్గిందని సర్కార్ లెక్కలు చెబుతున్నా గల్లీల్లో జనం జ్వరాలతో మంచం పడుతున్నారు. 2024లో 2,806గా ఉన్న కన్ఫర్మ్డ్ డెంగ్యూ కేసులు 2025లో 1,976కు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అయితే, 2021లో 220గా ఉన్న సస్పెక్టెడ్ చికెన్ గున్యా కేసులు 2025 నాటికి ఏకంగా 13,500 దాటి 60 రెట్లు పెరిగాయని అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. 2026 ప్రారంభంలోనే <<19102369>>కోరంటిలో OP<<>> రోజుకు 700 దాటడం గమనార్హం.

News February 10, 2026

HYD: మూసీ తీరాన ‘దోమల’ ఘోష!

image

మూసీ ప్రక్షాళన సంగతేమో కానీ.. దోమల సంతతి మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2024లో మూసీ పరీవాహక ప్రాంతాల్లో 450 మలేరియా కేసులు నమోదవ్వగా 2025 ముగిసేసరికి ఆ సంఖ్య 700 దాటేసింది. అధికారులు డ్రోన్లతో మందులు చల్లుతున్నామని చెబుతున్నా గుర్రపుడెక్క ముందు అవేవీ పనిచేయడం లేదు. సాయంత్రం 6 దాటిందంటే చాలు కిటికీలు తెరిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఏటా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా దోమలు తగ్గడం లేదు.