News April 16, 2025
HYD: 1.30లక్షల మంది యువకుల దరఖాస్తు

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.
Similar News
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
News April 22, 2025
HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్ 67.74 స్టేట్ 23వ ర్యాంక్
News April 22, 2025
రంగారెడ్డి: రైతు బిడ్డకు ఇంటర్లో TOP RANK

రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతుబిడ్డ తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో టాపర్‌గా నిలిచింది. ఇబ్రహీంపట్నం మం. పోచారానికి చెందిన నగేశ్ గౌడ్-సబిత దంపతుల కూతురు శ్రీవార్షిక MPCలో 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. ఇంగ్లిష్, సంస్కృతంలోనే ఒక్కో మార్కు రాలేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలంగాణ స్టేట్ టాప్ ర్యాంకర్‌గా రైతు బిడ్డ నిలవడం గర్వకారణం.
SHARE IT