News April 16, 2025

HYD: 1.30లక్షల మంది యువకుల దరఖాస్తు

image

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.

Similar News

News July 7, 2025

HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

image

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.

News July 7, 2025

HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

image

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.

News July 7, 2025

జూబ్లీహిల్స్‌ కోసం దండయాత్ర!

image

జూబ్లీహిల్స్‌ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.