News May 11, 2024

HYD: 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం: అమిత్‌ షా

image

మిగులు బడ్జెట్‌ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్‌ కూడా చేస్తోందని ఆరోపించారు. శనివారం HYDలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు.

Similar News

News November 17, 2025

సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్‌లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్‌పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్‌కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.

HYD పోలీసులకు పవన్ కళ్యాణ్ అభినందనలు

image

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాలతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పైరసీ ముఠా అరెస్ట్ శుభపరిణామన్నారు.