News May 11, 2024
HYD: 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం: అమిత్ షా

మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. శనివారం HYDలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు.
Similar News
News February 14, 2025
HYD: ఓయూ ఓపెన్ డిగ్రీ ప్రవేశ ప్రకటన

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ డిగ్రీ కోర్సుల రెండో విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశాలు UGC-దూరవిద్య బ్యూరో (DEB) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. అభ్యర్థులు www.osmania.ac.in లేదా oucde.net వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తుకు చివరి తేది 31 మార్చి 2025.
News February 14, 2025
HYD: కుంభమేళాకు వెళ్తూ యాక్సిడెంట్.. వ్యక్తి దుర్మరణం

కుంభమేళాకు వెళ్తున్న HYD వాసులు ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంగరకలాన్‌కు చెందిన సంపత్(25), ఉప్పుగూడకు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్ బుధవారం బయలుదేరారు. నిజామాబాద్‌లోని బాల్కొండ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దే అని పేర్కొన్నారు.