News March 9, 2025

HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

image

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

VKB: స్కూల్‌లో విద్యార్థికి విద్యుత్ షాక్

image

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 12, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

image

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 12, 2025

MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.