News March 9, 2025
HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.
News February 8, 2026
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 280, స్కిన్ రూ. 270లుగా విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ. 1000లగా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153లకు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి
News February 8, 2026
KMR: ఈ నెల 9 నుంచి 14 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రదేశాల్లో చీఫ్ మినిస్టర్ కప్-2026 జిల్లా స్థాయి క్రీడలను ఈ నెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా యూత్&స్పోర్ట్స్ ఆఫీసర్ రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పలు క్రీడలకు ఇన్‌ఛార్జ్‌లను సైతం నియమించారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసే క్రీడల వద్ద ప్రాథమిక చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలని DMHO డా.విద్యను ఆయన కోరారు. సంబంధిత PHC సిబ్బందిని ఆమె నియమించారు.


