News December 29, 2024
HYD: 10 నెలలు దాటినా రాని స్పష్టత.. కీలక ఫైల్స్ పెండింగ్

యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడంతో చాలా పనులు పెండింగ్లో పడుతున్నాయి. కౌన్సిల్ బాడీ లేకపోవడం అభివృద్ధికీ అడ్డంకిగా మారింది. నిర్ణయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ కీలకం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యుల పదవీకాలం ముగిసింది. ఆపై నూతన కౌన్సిల్ ఏర్పాటు అంశంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దాదాపు 10 నెలలు దాటినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆలస్యమవుతోంది.
Similar News
News October 25, 2025
HYD: ఓటు.. ఇవి ఉంటే చాలు!

జూబ్లీహిల్స్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్కార్డు, బ్యాంకు, పోస్టాఫిస్ పాస్బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, పాస్పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి RVకర్ణన్ తెలిపారు.
News October 25, 2025
ఖైరతాబాద్, శేరిలింగంపల్లికి ఉప ఎన్నిక: KTR

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే రాబోయే GHMC ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని KTR ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు కచ్చితంగా పడుతుందన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ జోస్యం చెప్పారు. TGలోని పార్టీ మారిన MLAల నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయని KTR తెలిపారు. కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు వివరించాలన్నారు.
News October 25, 2025
HYD: BRSతోనే మరింత అభివృద్ధి సాధ్యం: MLA

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచార వేడి రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాజీ మంత్రులు మల్లారెడ్డి, దయాకర్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి వెంగళ్రావునగర్ డివిజన్ పరిధి మధురానగర్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అపార్ట్మెంట్ వాసులతో MLA ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. BRSతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.


