News March 29, 2025

HYD: 10 రోజుల్లో ఎల్ఆర్ఎస్ అనుమతులు: HMDA

image

అర్హతలు పూర్తిచేసి, ఫీజులు సకాలంలో చెల్లించిన వారికి 10 రోజుల్లోనే ఎల్ఆర్ఎస్ అనుమతి పత్రాలు అందజేయనున్నట్లు HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సందేహాల నివృత్తికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజుల్లో 25% రాయితీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 23, 2025

3 లక్షల గృహాలకు ప్రారంభోత్సవాలు.. ఎప్పుడంటే?

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12కు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది. పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు.

News April 23, 2025

ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News April 23, 2025

ఇంటర్‌లో ఫెయిల్.. సివిల్స్‌లో ర్యాంకర్

image

UPSC తుది ఫలితాల్లో తిరుపతి జిల్లా వాసి సత్తా చాటాడు. నారాయణవనం(M) గోవిందప్ప కండ్రిగ వాసి సురేశ్ సివిల్స్‌లో 988 ర్యాంకుతో అదరగొట్టారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన ఆయన.. సివిల్స్‌లో సత్తా చాటడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. 2017 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన తాజాగా అనుకున్నది సాధించారు.

error: Content is protected !!