News March 9, 2025
HYD: 10 జాతీయ రహదారులు పూర్తి: కేంద్ర మంత్రి

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్. ఈ మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్‌లో డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్‌తో పాటు, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్ బటన్ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.
News October 30, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: కేటీఆర్.. అన్నీ తానై

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తమ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో చర్చిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికలను తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
News October 30, 2025
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


