News January 17, 2026
HYD: 10 నుంచి 12 జోన్లుగా HMDA విస్తరణ

HYD వేదికగా HMDA పునర్వ్యవస్థీకరణకు వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. HMDA 10 నుంచి 12 జోన్లుగా విభజన చేసే అవకాశం ఉంది, ఈ మేరకు అదనపు అధికారులను నియమించనున్నారు. జోనల్ కార్యాలయాల పరిధిలో అనుమతులు ఇవ్వని అంశాలపై స్పష్టతనిస్తూ, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
Similar News
News February 17, 2026
నా దగ్గర అంత డబ్బు లేదు: మస్క్

ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది ట్రిలియనీర్ అయ్యే ఛాన్స్ 75%పైనే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ.. తన వద్ద 0.1% కంటే తక్కువ డబ్బు ఉందన్నారు ఎలాన్ మస్క్. ఎక్కువ భాగం టెస్లా, స్పేస్ఎక్స్ వాటాల్లోనే ఉందన్నారు. టెస్లాలో 80%పైగా షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లవేనని తెలిపారు. ప్రస్తుతం మస్క్ సంపద $849.3B కాగా xAI, స్పేస్ఎక్స్ మెర్జ్‌తో ట్రిలియన్ మార్క్ టచ్ కానుందని అంచనా.
News February 17, 2026
కర్తరీ దోషం ఎలా ఏర్పడుతుంది?

ఖగోళ గమనం ప్రకారం.. సూర్యుడు మే నెలలో మేష->వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం గుండా ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి సూర్యుడు రోహిణి నక్షత్రం దాటే వరకు ఉన్న సమయాన్ని కర్తరీగా గణిస్తారు. దీనిని 2 రకాలుగా విభజిస్తారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నప్పుడు ‘చిన్న కర్తరీ’, మిగిలిన పాదాల్లో సంచరించేటప్పుడు ‘పెద్ద కర్తరీ’ ఏర్పడుతుంది. ఈ గ్రహ స్థితి వల్ల భూమిపై వేడి గాలులు పెరుగుతాయి.
News February 17, 2026
SAILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


