News February 15, 2026
HYD: 10 సీక్రెట్ నగరాలు ఇవే!

సంగారెడ్డి -నర్సాపూర్ Western Power: ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్
తూప్రాన్-గజ్వేల్ Northern Logistics: భారీ కంటైనర్ డిపోలు, ఈకామర్స్ వేర్‌హౌస్‌లు
భువనగిరి-చౌటుప్పల్ Eastern Gateway: ఎడ్యుకేషన్, కమర్షియల్ హబ్. మెట్రో రైలు ఛాన్స్
ఇబ్రహీంపట్నం-ఆమన్‌గల్ Southern Future: ‘ఫ్యూచర్ సిటీ’కి హార్ట్. ఫార్మా విలేజ్, ఏరోస్పేస్
చేవెళ్ల-జగదేవ్‌పూర్ Green Luxury : కాలుష్యం లేని టౌన్‌షిప్‌లు, హై-ఎండ్ విల్లాలు
Similar News
News February 15, 2026
నల్గొండ: గ్రామీణ ప్రతిభకు ‘సీఎం కప్’ వేదిక: కలెక్టర్

గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ‘సీఎం కప్’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. సరైన వేదికలు లేక వెనుకబడుతున్న గ్రామీణ క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశమని, పట్టుదలతో ఆడి జిల్లాకు కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News February 15, 2026
KNR: ‘కమిషనరేట్’ పరిధిలో ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు

కరీంనగర్ MCK పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS (సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
News February 15, 2026
పవర్ ప్లేలో భారత్ స్కోర్ 52-1

T20WC: తొలి ఓవర్లోనే అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్(42*) ధనాధన్ ఆటతో భారత్ పవర్ ప్లే ముగిసే వరకు 52 పరుగులు చేసింది. అటు తిలక్ వర్మ(10*) ఆచితూచి ఆడుతున్నారు. తొలి 6 ఓవర్లలో 5 ఓవర్లను పాక్ స్పిన్నర్లతోనే వేయించడం విశేషం.


