News January 3, 2025
HYD: 100 కుటుంబాలే 31 వేల ట్యాంకర్లు బుక్ చేశాయి!
గ్రేటర్ హైదరాబాద్‌లో 2024లో 6 డివిజన్లలో 20 సెక్షన్ల నుంచి అత్యధికంగా ట్యాంకర్లు బుక్ అయ్యాయని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గత వేసవిలో 100 కుటుంబాలు 31,000 ట్రిప్పులు బుక్ చేయగా, 40,000 కుటుంబాలు 70% ట్యాంకర్లు వినియోగించుకున్నాయి. సర్వే ప్రకారం, 18,000 కుటుంబాలకు ఇంకుడు గుంతలు ఉన్నాయి. నీటి కొరత కారణాలు గుర్తించి పరిష్కారాలు సూచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News January 14, 2025
SUPER.. దేశంలోనే మొదటి పార్కింగ్ కాంప్లెక్స్ మన HYDలో..!
HYD నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ పార్కింగ్‌ను 15 అంతస్తులు మేర, జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలో ఇదే మొట్ట మొదటి పెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది.
News January 14, 2025
HYD: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో..
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
HYD: మిసెస్ ఇండియా తెలంగాణగా మిథాలీ అగర్వాల్
హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.