News January 7, 2026
HYD: 1000 డాలర్ల కోసం నిఖిత హత్య?

అమెరికాలో HYD యువతి నిఖిత హత్యకు డబ్బుల విషయమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. US పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అర్జున్ శర్మకు నిఖిత 4500 డాలర్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అందులో 3500 డాలర్లు ఇవ్వగా మిగతా డబ్బులు ఇవ్వాలని నిఖిత అడిగింది. ఈ క్రమంలో గొడవ పెద్దదై అర్జున్ నిఖితను హత్య చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా <<18770024>>డబ్బుల విషయమే<<>> హత్యకు కారణం అయ్యిందని మీడియా ద్వారానే తెలిసిందన్నారు.
Similar News
News January 26, 2026
HYD: భూములు వదులుకునేవారికి ‘భారీ నజరానా’..!

నగరంలోని చెరువులు, నాలాల పరిరక్షణకు ప్రభుత్వం సరికొత్త TDR పాలసీని తీసుకొచ్చింది. ఇకపై నాలా వెడల్పు కోసం ప్రైవేటు భూములిస్తే రోడ్డు విస్తరణతో సమానంగా 400% TDR ఇస్తారు. అలాగే చెరువుల బఫర్ జోన్లలో స్థలాలు వదులుకునేవారికి 300% TDR లభిస్తుంది. ఒకవేళ ఆ స్థలం చెరువు అభివృద్ధి పనులకు అవసరమైతే ఏకంగా 400% వరకు బెనిఫిట్స్ కల్పిస్తారు. సెట్‌బ్యాక్ నిబంధనల్లో కూడా సడలింపులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
News January 26, 2026
ఆన్‌లైన్ TDR బ్యాంక్.. మరింత పక్కాగా ట్రాన్సాక్షన్స్..!

TDR సర్టిఫికేట్ల జారీ, అమ్మకం, వినియోగంలో ఎలాంటి మోసాలకు తావులేకుండా GHMC ‘ఆన్‌లైన్ TDR బ్యాంక్’ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి సర్టిఫికేట్ ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. యజమాని ఫోన్‌కు వచ్చే OTP ద్వారానే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి థర్డ్ పార్టీ డిస్టర్బ్ పెట్టే ఛాన్స్ లేదు. ఎవరికైనా టీడీఆర్ కావాలన్నా లేదా అమ్మాలన్నా ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో నోటిఫికేషన్ ద్వారా తమ అవసరాలను తెలియజేయవచ్చు. SHARE IT.
News January 26, 2026
TDR DOUBTS.. గ్రేటర్ దాటి.. HMDA అంతా చుట్టి..!

టీడీఆర్ సర్టిఫికేట్లను మునుపు కేవలం ఓఆర్ఆర్(ORR) లోపల మాత్రమే వాడేవారు. కానీ, 2022లో వచ్చిన సవరణల ప్రకారం, GHMC ఇచ్చే టీడీఆర్ కార్డులను ఇప్పుడు పూర్తి HMDA ఏరియాలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అంతేకాకుండా అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు (455A సెక్షన్ కింద) 33% కాంపౌండింగ్ ఫీజు బదులు సమాన విలువైన టీడీఆర్‌ను వాడుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.


