News January 20, 2025

HYD: 10TH, ఇంటర్, ITI, డిగ్రీ వారికి బెస్ట్ ఛాన్స్

image

HYD నాంపల్లి పరిధి మల్లేపల్లి ITI కాలేజీలో నేషనల్ ఇంటర్న్‌షిప్ మేళా నేడు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుందని అధికారులు తెలిపారు. 5వ తరగతి నుంచి 12 వరకు పాసైన వారు, ITI, బీటెక్ డిగ్రీ, ఇతర డిగ్రీలు చేసినవారికి ఇంటర్న్‌షిప్ అందించి, ఉద్యోగాలు కల్పించనున్నారు. 1000కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటారని, అన్ని జిల్లాల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 18, 2025

HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

image

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టు‌లో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.

News February 18, 2025

HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం 

image

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్‌ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.

News February 18, 2025

విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదవ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!