News February 3, 2026
HYD: 10TH స్టూడెంట్స్‌కు GOOD NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాపర్లుగా నిలిచే 10TH విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టేట్ ర్యాంకర్‌కు రూ.5లక్షల నగదు బహుమతి, జిల్లా టాపర్లకు రూ.2లక్షలు, నియోజకవర్గ, మండల టాపర్లకు రూ.10వేలు అందజేస్తామని DRO వెంకటాచారి తెలిపారు. కలెక్టరేట్‌లో ‘చదువుకో తెలంగాణ’ గోడపత్రికను ఆయన లక్డీకాపూల్‌లో ఆవిష్కరించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెల్లడించారు. ఈ పథకంతో మొత్తం రూ.2.2కోట్ల బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 7, 2026
HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
News February 7, 2026
హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @278

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శనివారం తెల్లవారుజామున గాజులరామారంలో 278గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 7, 2026
HYD: అవినీతికి నిలయంగా GHMC ‘ఇంజినీరింగ్’ విభాగం..?

GHMCలో అత్యధిక అవినీతి విభాగంగా ఇంజినీర్ విభాగం మారింది. ఓవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఒక్కో టెండర్‌కు ఒక్కో నిబంధనలో పెడుతూ కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు లంచాలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. వీటికి ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం.


