News April 10, 2025
HYD: 11 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్ కమిషనరేట్‌లో 11 మంది ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమనగల్ CIగా జానకిరామ్ రెడ్డి, పేట్‌బషీరాబాద్ డీఐ సుంకరి విజయ్‌ని చందానగర్‌కు, ఆమనగల్ సీఐ ప్రమోద్ కుమార్‌ను RGIAకు, శామీర్‌పేట్ డీఐ గంగాధర్‌ను కడ్తాల్ PSకు, కడ్తాల్‌లో పనిచేస్తున్న శివప్రసాద్‌ను సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 23, 2025
HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లభించింది. TMRJC ఖైరతాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కులకు గాను 495 మార్కులు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
News April 23, 2025
సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు.
News April 23, 2025
హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.