News April 2, 2024
HYD: ‘13న KCR సభ దద్దరిల్లాలి’

పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపే లక్ష్యంగా ఈనెల 13న చేవెళ్లలో నిర్వహించే KCR భారీ బహిరంగ సభ దద్దరిల్లాలని BRS ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను చేవెళ్ల MLA కాలే యాదయ్య ఆధ్వర్యంలో MLA సబితా ఇంద్రారెడ్డి, అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, MLA టి.ప్రకాశ్ గౌడ్, MLC వాణిదేవి తదితరులు పరిశీలించారు.
Similar News
News December 9, 2025
వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్’.. స్పష్టత ఏది?

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

TG గ్లోబల్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్‌లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.
News December 9, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేసేందుకు తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట వేశారు. శక్తివంతమైన గుస్సాడీ, బోనాలు, పేరిణి శివతాండవం వంటి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. అతిథులకు ప్రత్యేకంగా ‘తెలంగాణ మెనూ’ను సిద్ధం చేశారు. ఇందులో సకినాలు, సర్వపిండి, దమ్ బిర్యానీ, హలీమ్ వంటి సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి.


