News June 23, 2024
HYD: 138కు చేరనున్న ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య

HYD కూకట్పల్లి JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య 138కు చేరనుంది. ప్రస్తుతం వీటి సంఖ్య 139 ఉండగా గుర్తింపు పునరుద్ధరణలో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఒక కళాశాల తొలగింపునకు యాజమాన్యం నుంచి వినతి అందింది. మల్లారెడ్డి కళాశాలల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీని.. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో విలీనం చేస్తున్నట్లు JNTUకు దరఖాస్తు చేసిందని అధికారులు తెలిపారు.
Similar News
News December 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ. 5.91 కోట్ల దుబారా!

NOVలో జరిగిన జూబ్లీ బైపోల్ నిర్వహణకు రూ.5.91 కోట్లు ఖర్చు చేసినట్లు RTI ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిపై FGG అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త సిబ్బంది, వాహనాలు, పారామిలటరీ బలగాలు లేకుండా ప్రశాంతమైన జూబ్లీహిల్స్లో ఇంత భారీ ఖర్చు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా జరిగిందని, వెంటనే ఖర్చుపై ఆడిట్ నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని FGG ECకి విజ్ఞప్తి చేసింది.
News December 5, 2025
సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

సికింద్రాబాద్లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 5, 2025
HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

మా ప్రాంతాలను గ్రేటర్లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.


