News April 25, 2024

HYD: 15 లక్షల మంది ఓటర్లు పెరిగారు!

image

HYD నగరం వేగంగా విస్తరిస్తున్నట్లుగానే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల వరకు సుమారు 15 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గ్రేటర్ HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది. మొత్తం తెలంగాణ ఓటర్లలో ఇది 30% ఉంటుందని అధికారుల అంచనా.

Similar News

News January 9, 2025

శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.

News January 9, 2025

GHMC: జనవరి 31 లాస్ట్ డేట్, తర్వాత చర్యలే!

image

గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా దుకాణ,వ్యాపార సముదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు మీసేవ, ఆన్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చన్నారు. అంతేకాక ఫీజు పెండింగ్ సైతం 31 తేదీలోపు చెల్లించాలని, లేదంటే తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News January 8, 2025

పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే స్థానిక ఎన్నికలు: JAC

image

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని సర్పంచుల సంఘం JAC నిరసన తెలిపింది. అనంతరం నాంపల్లిలోని TG ఎన్నికల కమిషనర్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు.