News April 5, 2024
HYD: 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు HYD కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జూన్‌లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టే పార్టీకే మద్దతు ఉంటుందన్నారు.
Similar News
News December 26, 2024
HYD: వారిని కించపరచొద్దు.. BSNLకి మాజీ ఎంపీ వినోద్ లేఖ
మొబైల్ ఫోన్ సందేశం పేరిట జడ్జిలు, పోలీస్ అధికారులను కించపరచొద్దని BSNL HYD సీజీఎంకు BRS మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సైబర్ క్రైమ్ అలెర్ట్ కోసం చేస్తున్న ప్రకటనల్లో ‘మీకు జడ్జిలు, పోలీసులు వీడియో కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్‌లకు పాల్పడవచ్చు’అని ఫోన్ కాల్‌కు ముందు వస్తోందన్నారు. ఇందులో తప్పు దొర్లుతోందని, ‘జడ్జిలు, పోలీసుల పేరిట’ అని ఇవ్వాలని కోరారు.
News December 26, 2024
HYD: 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి
2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.
News December 26, 2024
HYD సీపీ చేతనైతే ఆ పని చేయాలి: ఎంపీ రఘునందన్‌రావు
ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్‌గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.